ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ

ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ
హుషారుగొలిపేవెందుకే - నిషా కనుల దానా
ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ
హుషారుగొలిపేవెందుకే - నిషా కనుల దానా

చరణం 1:
ఓ ఓ ఓ..
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది - నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది - నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం - పొంగిపొరలె నాలోన
ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ
హుషారుగొలిపేవెందుకే - నిషా కనుల వాడా

చరణం 2:
ఒహో చెలియా నీవు కూడ - ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవు కూడ - ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలో - వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు, - మజ్నువవుతావూ
నే వెళితే మరి నీవు, - మజ్నువవుతావూ
మజ్ను నేనైతే ఓ లైలా - లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా - లోకమే చీకటై పోవునే

ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ
హుషారుగొలిపేవెందుకే - నిషా కనుల వాడా

చరణం 3:
ఆకాశంలో ఇంద్రధనస్సుపై - ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై - తేలిపోదామీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై - కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై - ఏకమౌదమా తీయగా

ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా వుందాములే - హమేషా మజాగా

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు