నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి

నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 1:
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 2:
పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 3:
పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు