Showing posts with label వేదం. Show all posts
Showing posts with label వేదం. Show all posts

ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్

ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

posted under |

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని వుందని తెలుసుకో

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని వుందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావ గుర్తు పడతావా

కలలా నిజాలా కనులు చెప్పే కథలు
మరల మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనె ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో

posted under |

ఏమి తెలిసి నను మోహిస్తివి

ఏమి తెలిసి నను మోహిస్తివి
దేహమేలాంటిదని నీవాలోచిస్తివి
అచ్చమైన తోలు తిత్తి
అందున గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము
ఆయువైన క్షణము మాయము
ఏ ఫలము వుందని ఇందు చేరితివి
నిజ మర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి

posted under |

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనే వుంటే ఉన్నా లేనట్టే
now or never! now or never! Now or Never!
||పద పద||
.
||చ||
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు ||2||
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదటలేని మరునాటిని నేడే కలలపంట చూస్తూ
||పద పద||
.
||చ||
నీతో నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు ||2||
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీకధ కక్కడ శ్రీకారం చుట్టు
||పద పద||

posted under |
Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు