Showing posts with label ఓయ్. Show all posts
Showing posts with label ఓయ్. Show all posts

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కొరితే ఎల్లాగో ఎల్లాగో మరి

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా

చిగురుల తోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందిచేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

మెలకువ లోన కలలను కన్నా నిజములు చేస్తావనీ
చిలిపిగ నేనే చినుకౌతున్నా నీ కల పండాలని
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేయవా

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

posted under |

అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే

అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే జరగని కలలో ఎప్పుడైన ఈ పని లేని ఆలొచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటు లైఫే గడిపెయి మెరుపులా
గల గల పారేటి నది ఎక్కనైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చెలిమై వెలిగిపోవాలంటే
తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు గమ్యం ఏదో తెలిసీ సాగిపొవే
రేపటికై కలలు కంటు కలలన్నీ నిజం చేస్తూ ఆశే నీ శ్వాస ఐతే రాతే మారిపోదా
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

అంతు లేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం మందీ
అందుకోసమే చెపుతున్నా రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్ మనసుకు తోచింది చేసెయ్
అడిగితె ఈమాట చెప్పెయ్ నవ్వుతుండగానె మగ్గి పొతే స్వర్గమే అని
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

posted under |

నను వదిలీ నీడ వెళ్ళిపొతోందా..కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..

నను వదిలీ నీడ వెళ్ళిపొతోందా..కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..
వేకువనే సంజె వాలి పోతోందే..చీకటిలో ఉదయముండిపోయిందే..
నా ఎదనే తొలిచిన గురుతుగ నిను తెస్తున్నా..
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతోన్నా..
నువ్వుంటే నేనుంటా..ప్రేమా..పోవొద్దే..పోవొద్దే..ప్రేమా..
నను వదిలీ నీడ వెళ్ళిపొతోందా..కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..

ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం..వెంట పడిన అడుగేదంటోందే..ఓఓ..ఓఓ..ఓ..
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తోందే..
కోరుకున్న జీవితమే..చేరువైన ఈ క్షణమే..జాలి లేని విధిరాతే..శాపమైనదే..
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే..??? మబ్బు తన అడలిక సాగని చోటే..
నువ్వుంటే నేనుంటా..ప్రేమా..పోవొద్దే..పోవొద్దే..ప్రేమా..

నువ్వుంటే నేనుంటా..ప్రేమా..పోవొద్దే..పోవొద్దే..ప్రేమా

posted under |

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..
చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..
నిను వెతికానే..నన్నే తాకే..గాలులనే ఆరా తీస్తూ..
నిలుచున్నానే నీకై వేచే..తీరాన్నే ఆరాధిస్తూ..
ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..
ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..
ఓఓఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓఓఓ..ఓఓఓ...
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..
చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..

నువ్వూ నేనూ ఏకం అయ్యే..ప్రేమల్లోనా..ఓ..ఓ..
పొంగే ప్రళయం నిన్నూ..నన్నూ..వంచించేనా..
పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ..ఆ...
నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ..ఆ...
విధినైనా వెలేయనా..నిను గెలిచేయనా..నీకోసం నిరీక్షణా..ఆ..ఆ..I am waiting for you baby..
ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..
ఓఓఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓఓఓ..ఓఓఓ...

ప్రేమనే ఒకే మాటే..ఆమెలో గతించిందా..
వీడనీ భయం ఏదో..గుండెనే తొలుస్తోందా..
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా..
విధినైనా వెలేయనా..నిను గెలిచేయనా..నీకోసం నిరీక్షణా..ఆ..ఆ..I am waiting for you baby..

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..
చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..
నిను వెతికానే..నన్నే తాకే..గాలులనే ఆరా తీస్తూ..
నిలుచున్నానే నీకై వేచే..తీరాన్నే ఆరాధిస్తూ..
ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..
ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..

posted under |
Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు