Showing posts with label సఖి. Show all posts
Showing posts with label సఖి. Show all posts

సఖియా చెలియా

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపె పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె
యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె

కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికె కొపం ఎర్రాని రూపం ఉడికె కోపం
సంధ్యావర్న మంత్రాలు వింటె ఎర్రని పంట పాదమంటె
కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గొరంత పచ్చ
పచ్చ పచ్చ పచ్చా
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం
సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

అలలే లెని సాగర వర్ణం ముయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం గుమ్మాది పూవ్వు తొలి వర్ణం
వూదాపువ్వు రెక్కల పై వర్ణం
ఎన్నొ చేరెనీ కన్నె గగనం
నన్నె చేరె ఈ కన్నె భువనం

రాత్రి నలుపు రంగు నలుపే వానా కాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లొ కారునలుపే కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగి పాడే కొయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియ చెలియ నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

తెల్లని తెలుపే యద తెలిపే వానలు కడిగిన తుమ్మి తెలిపే
తెల్లని తెలుపే యద తెలిపే వానలు కడిగిన తుమ్మి తెలిపే
ఇరు కను పాపల కథ తెలిపే ఉరుకు మనసు తెలిపేఎ
ఉరుకు మనసు తెలిపే ఉరుకు మనసు తెలిపే

posted under |

ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా

ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
అలై కన్నా..

చరణం 1:
నిలబడి వింటూనే చిత్తరువైనాను - నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర - ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ
కన్నుల వెన్నెల పట్టపగలు పాల్చిలుకుగా - కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే - కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే - కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒక విధమై ఒరిగేలే - అనంతమనాది వసంతపదాల
సరాగ సరాల స్వరానివా - నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా!
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా // అలై పొంగెరా //

posted under |
Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు