ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా! // ఈ విశాల ప్రశాంత //
చరణం 1 :
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో.. ఓ..
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా!
నిదురించు జహాపనా! // ఈ విశాల ప్రశాంత //
చరణం 2 :
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా // ఈ విశాల ప్రశాంత //