ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ..
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ...ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా ...
నా చూపుల దారులలో చిరు దీపం వెలిగేలా ...నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా ...
జ్ఞాపకాలే మైమరపు ...జ్ఞాపకాలే మేకోలుపు ...జ్ఞాపకాలే నిట్టూర్పు...జ్ఞాపకాలే ఓదార్పు ...||ఏదో ఒక రాగం ||
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే ...
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే ...
తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే ...
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం ...చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం ..|| ఏదో ఒక రాగం ||
మెరిసే తారాలలో నీ చూపులు జ్ఞాపకమే ...
ఎగసే ప్రతి అలలో నీ ఆసలు జ్ఞాపకమే ...
కోవెల లోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే ...
పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం ...మరపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ...
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ...ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా ...
నా చూపుల దారులలో చిరు దీపం వెలిగేలా ...నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా ...
జ్ఞాపకాలే మైమరపు ...జ్ఞాపకాలే మేకోలుపు ...జ్ఞాపకాలే నిట్టూర్పు...జ్ఞాపకాలే ఓదార్పు ...