అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు .

అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు ...
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు ...
మెలికలు తిరిగే నాడు నడకలకు ...మరి మరి ఉరికే మది తలపులకు ...
లల లల ..లలలలలలలా ... || అలుపన్నది ||

నా కోసమే చినుకై కరిగి ఆకాసమే దిగదా ఇలకూ...
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనడ వెలుగు ...
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకూ... కలలను తేవా నా కన్నులకు ...
లల లల లలలలలలలా.... || అలుపన్నది ||
నీ చూపులే తడిపే వరకూ ఏమైనదో నాలో వయసు...
నీ ఊపిరే తగిలే వరకూ ఎటువున్నదో మెరిసే సొగసు ...
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరచే తరుణం కొరకు... ఎదురుగ నడిచే పరి ఆసలకు ...
లల లల లలలలలా ...

అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు ...
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు ...
మెలికలు తిరిగే నాడు నడకలకు ...మరి మరి ఉరికే మది తలపులకు ...
లల లల ..లలలలలలలా

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు