నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలి లా వచ్చి గుడి గంటలే కొట్టి
మన ప్రేమనె చాటవా

చరణం 1
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే
నీ పాటలో పల్లవే కావలి
నా యెదలొ మెదిలె కధలె పాడాలి
నీ కళ్ళలూ నన్నుండి పోని నీ గుండెలూ రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలె తెరిచి
మన ప్రెమనె చూపని

చరనం 2
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగ ఉంది ఈ తీపి బాధ
ఈ దూరమె దూరమై పోవాలి
నీ జతలొ బ్రతుకే నదిలా సాగాలి
నీ కళ్ళలో నన్నుండి పోని నీ గుండెలో రాగాన్ని కాని
చిరుగాలి లా వచ్చి గుడిగంటలె కొట్టి
మన ప్రేమనే చాటవా

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు