నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని యెదురైన గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ

చరణం 1
నీలో ఆశ రేపె శ్వాస పేరే ప్రేమ కాద
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాద
జీవితాన్నికో వరం ప్రేమని
ప్రేమ లేని జీవితం లేదని
ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు

చరణం 2
నిన్నూ నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాద
మిన్నూ మన్ను తడిపె చిలిపి చినుకె ప్రేమ కాద
లోపమంటూ లేనిదే ప్రేమని
ప్రేమ నీకు శాపమేంకాదని
యెదలొ పలికేనట కళ్యాణ రాగాలు

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు