నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలొ ఈ ఆలపన

నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలొ ఈ ఆలపన
యెడబాటు రేపిన విరహ వేదన నరకయతన
కాలమే దీపమై దారిచూపునా..

చరణం 1
కళ్లలొన నిన్ను దాచిన ఊహల్లొన ఊసులడిన
స్వప్నం లొన ఎంత చూసిన విరహమే తీరదె
జాజి కొమ్మ గాని ఊగిన కాలి మువ్వ గాని మోగిన
చల్ల గాలి నన్ను తాకిన నీవనే భావనే
ఎదురుగ లేనిదె నాకెం తొచదే రెపటి వేకువై రావే

చరణం 2
నిన్ను తప్ప కన్ను చూడదె లొకమంత చిమ్మ చీకటే
నువ్వు తప్ప దిక్కు లేదు లే ఓ సఖీ నమ్మవే
గుండె గూడు చిన్నబోయెనే గొంతు ఇంక మూగబొవునే
నువ్వు లేక ఊపిరాడదె ఓ చెలీ చేరవే
ఆశలు ఆవిరై మోడైపొతినే తొలకరి జల్లువై రావే..

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు