యమున తీరం సంధ్య రాగం

యమున తీరం సంధ్య రాగం
యమున తీరం సంధ్య రాగం
నిజమైనాయి కలలు
నీల రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో

చరణం 1
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదే ప్రేమ
హృదయంల తననైన మరిచేదీ ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా

చరణం 2
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ
చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు