ఆనతి నీయరా హరా

ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగా
ఆనతి నీయరా హరా

నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితొ విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్యపాలనమ్
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
కదులు కదా సదా సదాశివ ||ఆ

అచలనాధ ఆర్చింతును ర
ఆనతి నీయరా

జన్గమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడర
సాష్టాంగము గా దన్డము చేతు ర
ఆనతి నీయరా

శంకర శంకించకు రా వంక జాబిలిని జదను ముడుచుకొని విశపు నాగులను చంక నెత్తుకొని
నిలకడ నెరుగని గంగా నే లీ ఏ వంక లేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిక సెవిన్చుకొన్దుర..

రక్ష ద్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష
నీ కృపావీక్షణా వీక్షణాపెక్షిత ఉపేక్ష చేయక పరీక్ష చేయక
రక్ష రక్ష యను ప్రార్ధన వినరా

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు