కొత్తగా రెక్కలొచ్చెనా

కొత్తగా రెక్కలొచ్చెనా
ఏటిలొని గువ్వ పిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటు నున్న కన్నె మల్లికి ||కొ||

1|| కొండ దారి మార్చిందీ కొంటె వాగు జో రూ
కులుకు లెన్నో నేర్చిందీ కలికి ఏటి నీరు ||కొ||

బండ రాల హూరు మారి పంట చేల పాత లూరీ
మేఘాల రాగాల మాగాణి వూగేలె
తొలి చిందు లేసింది కనువిందు చేసింది

2|| వెదురు లోకి వొదిగిందీ కుదురు లేని గాలే
ఎదురు లేక ఎదిగిందీ మధుర గాన కేళి

భాష లోన రాయలేని, రాస లీల రేయి లోని ||భా||
యమున తరంగాల కమనీయ శృంగార
కలలెన్నో చూపింది కళాలెన్నొ రేపింది

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు