కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల
నిజము తెలిసినా కలని చెప్పినా మనసునమ్మదేల
ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా
ఇదిగో ఇపుడె చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
అయితె నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ

చరణం 1
పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం వుంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం వుందని ఇపుడెగా తెలిసింది
నీతో అది చెప్పింద నీ ఙ్ఞాపకాలే నా ఊపిరైనవని

చరణం 2
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టు తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ వుంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నక్కూడ ఈ కలవరమిపుడె పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వె కనిపించావే
నేనె ఇక లేనట్టు నీలొ కరిగించావే
ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు