నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్

నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
పూవుల యెదలొ శబ్దం మన మనసులు చేసే యుధ్ధం ఇక ఓపదే నా హృదయం
ఓపదే నా హృదయం
సౌక్యామాసౌక్యం పక్క పక్కనే వున్టై పక్క పక్కనే చూపుకు రెన్డు ఒక్కటే
బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెన్డు వేరేలే
నను ప్రేమించానను మాట||

రేయిని మలిచి ఆ......... నా రేయిని మలిచి
కనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావు
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు
మెరిసే చుక్కల్ని తెcచి వేలి గోళ్ళుగ మలిచి
మెరుపుల తీగని తెచ్చి పాపిటగ మలిచావో
వేసవి గాలులు పీల్చిన వికసించే పూవులు తెచ్చి
మంచి గాంధాలేన్నో పూసే మేను మలిచావో
అయినా మగువా... మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసును శిలగా చేసినావే

నను ప్రేమించానను మాట||

వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు నిలిపింది నీవేగా
గాలి నేలా నింగి ప్రేమా ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరొ ఓ ప్రేమా నీవేగా
గంగ పొంగే మనసు కవితల్ని పాడుతు ఉంటె
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావె

నను ప్రేమించానాను మాట||

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు