మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దెవిది ఏ రూపం
నా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

చరణం 1
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనో
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా

చరణం 2
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూదాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలొ జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన...

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు