ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి
యేవేవొ కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి

చరణం 1
అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
యెలేలొ అని గోదారి నాతొ ఊసులు ఆడలి
ఇంధ్ర ధనసుని ఊయల గ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావలి
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కల్లాపే చల్లాలి ఆ రంగుల నుండి లాలించే
ఒక రాగం పుట్టాలి

చరణం 2
నా వాడు ఎక్కడున్న సరె రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడుంటు యెన్నడైన సరె పసి పాపల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
యేనాడు నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు