కోపమా నాపైనా ఆపవా ఇకనైనా

కోపమా నాపైనా ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగవే ఇటు పైనా
ఎంతగా నస పెడుతున్నా లొంగి పోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైన కలిసేనా

చరనం 1
ఓ కస్సుమని కారం గా కసిరినది చాలింక
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడ దాక కలిసి అడుగెయ్యవు గా
కన్నుల వెనకె కరిగిపోయె కలవి గనుకా
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువు గొడుగునె ఎగరేస్తావే జడివానా.. హో

చరణం 2
తిరిగి నిను నాదకా చేర్చినది చెలిమే గా
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనుకా
సులువు గ నీలాగా మర్చిపోలేదింకా మనసు విలువ
నాకు బాగా తెలుసు గనకా
ఎగసె అల యేనాడైన తన కడలిని విడిచేనా
ఒదిలేస్తె తిరిగొచ్చేనా క్షణమైనా ..హో

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు