మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు

కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మొతలు
మందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి

మూసిన||

ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్వులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన||

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు