ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ ||ఈ వేళలో||

చరణం 1
నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచింది
నువు కాక వేరేది కనిపించనంటొంది
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తొచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు.....నవ్వుకుంటావు ||ఈ వేళలో||

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు