ప్రియ ప్రియతమా రాగాలు

ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంతే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియ

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి
అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి
ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే

ప్రియ

శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా
ఎవరు ఎంత వలచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
నడి ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే

ప్రియ

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు