మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా

మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా

మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమా
ముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే..నయగారమా
గాలికే సంకెళ్ళేసావే

నన్నిలా మార్చగల..కళ మీ సొంతమా
ఇది మీ మాయవల ..కాదని అనకుమా
ఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే

కలిసిన పరిచయం ఒక రోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో
గుండెలో ఎదో ఇంకో సత్యం ఉందేమో

నన్నిలా మార్చగల..కళ మీ సొంతమా
ఇది మీ మాయవల ..కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే..నయగారమాగాలికే సంకెళ్ళేసావే

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథా
మరియొక జన్మలా మొదలవుతున్నదా
ఓ .. పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా

మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమా
ముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమా
ఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే !

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు