మనసా తుల్లి పడకే

మనసా తుల్లి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభ ఘడియా వcచేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా

ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శృతి మిన్చకే నీవు మనసా

ఏనోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరము
మనసా నిన్నే మహా అందగాడు
తనుగ జతగా మనకన్ది రాడు
కలలాపవే కన్నె మనసా

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు