చూపు చాలు ఓ మన్మధుడా -
ఆగనంది నా గుండె దడ తెలుసుకో సుందరా -
నా మనసులో తొందరా..
మాట చాలు ఓ మాళవికా -
ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా -
నీ మనసులో సరిగమ కలుపుకోవ నన్ను నీవు -
యుగ యుగాల కౌగిలిగా కలిసిపో మరింత నాలో - నువ్వు నేనుగా.. // చూపు చాలు ఓ //

చరణం 1: ఏరి కోరి నీ యెద పైన - వాలి పోనిది వయసేనా..
తేనే తీపి పెదవి అంచుతో - పేరు రాసుకోనా..
నింగి జారి తనుకుల వాన - కమ్ముకుంటే కాదనగలనా..
అందమైన అద్బుతాన్నిలా - దారికి పిలుచుకోనా.. హే.. హె..
ఆడించు నన్ను.. పాడించు నన్ను - నీ హాయి నీడలో..
తెలుసు లే అందమా - నీ మనసులో సరిగమ.. // చూపు చాలు ఓ //

చరణం 2: ఆడ మనసులో అభిలాష - అచ్చ తెలుగులో చదివేసా..
అదుపు దాటి వరదయ్యింది - ఈ చిలిపి చినుకు వరస…
హె నన్ను నేను నీకొదిలేసా.. ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తేసుకో ..వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని అనలేని వాణ్ణి - ఆరాలు తీయనా..
తెలుసులే అందమా.. నీ మనసులో సరిగమ.. // చూపు చాలు ఓ /

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు