నెమలికి నేర్పిన నడకలివీ...
మురళికి అందని పలుకులివీ...
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా.... (నెమలికి)

కలహంసలకిచ్చిన పదగతులూ..
ఎలకోయిల మెచ్చిన స్వరజతులూ... (కలహంసల)
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ...
ఏవేవో కన్నుల కిన్నెరలూ... (ఎన్నెన్నో)

కలిసిమెలిసి కళలువిరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా మల్ప శిల్ప మణిమేఖలనూ శకుంతలనూ... (ఓ ఓ నెమలికి)

చిరునవ్వులు అభినవ మల్లికలూ...
సిరిమువ్వలు అభినయ దీపికలూ... (చిరునవ్వులు)
నీలాల కన్నుల్లో తారకలూ...
తారాడే చూపుల్లో చంద్రికలూ... (నీలాల)
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనా లెఖ్య సరస సౌందర్యరేఖనూ శశిరేఖనూ...

ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ...
మురళికి అందని పలుకులివీ...
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా.... (నెమలికి)

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు