బృందావనమది అందరిది గోవిందుడు
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే (2)
ఎందుకె రాధ ఈసునసూయలు అందములందరి ఆనందములే (2) // బృందావనమది //
చరణం 1: పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే (2)
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే.. (2) // బృందావనమది //
చరణం 2: రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే (2)
ఎందుకె రాధ ఈసునసూయలు అందములందరి ఆనందములే // బృందావనమది /