కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2)
విశ్వనాధ పలుకై
అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై
అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి (2)
కొండమల్లెలే కొప్పున పెట్టివచ్చే దొరసాని
మా వన్నెల కిన్నెరసాని // కిన్నెరసాని //
చరణం 1: ఎండల్లకన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి (2)
కనులా గంగా పొంగేవేలా నదిలా
తానే సాగేవేళ రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే // కిన్నెరసాని //
చరణం 2: మాగాణమ్మ చీరలు నేసే
మలిసందేమ్మా కుంకుమ పూసే
మువ్వలబొమ్మా ముద్దుల గుమ్మా (2)
గడపాదాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే // కిన్నెరసాని