Showing posts with label ఆర్య. Show all posts
Showing posts with label ఆర్య. Show all posts

తకదిమి తోం తకదిమి తోం

హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం యెదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైనా చేదైనా తకదిమి తోం
తప్పో వొప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కౄషి వుంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కరియె జీయేంగె ప్యార్ కరియె

చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువల ఓ ఉప్పెనలా ఉరకాలిర
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం
గురి చూసాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కరియె

నీ మాటతొ అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నా ప్రేమతొ ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కరియె

posted under |

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
యేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటె నిజమేగా స్వప్నం
నువ్వుంటె ప్రతి మాట సత్యం
నువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతం
నువ్వుంటె ప్రతి అడుగు అందం
నువ్వుంటె ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటె ఇక జీవితమంతా ఏదొ సంతోషం

పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణం
అడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలద స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కద వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లొ కలకాలం
నువ్వుంటె ప్రతి ఆశ సొంతం
నువ్వుంటె చిరుగాలె గంధం
నువ్వుంటె ఎండైన కాద చల్లని సాయంత్రం
నువ్వుంటె ప్రతి మాట వేదం
నువ్వుంటె ప్రతి పలుకు రాగం
నువ్వుంటె చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం

ఉన్నచోట ఉన్నాన ఆకశమందుకున్నాన
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేన
మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లె నన్నల్లె ఈ రంగులు నీ వల్లె
సిరిమల్లెల వాగల్లె ఈ వెన్నెల నీవల్లె
ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోన
నువ్వుంటె దిగులంటూ రాదె
నువ్వుంటె వెలుగంటూ పోదె
నువ్వుంటె మరి మాటలు కూడ పాటైపోతాయె
నువ్వుంటె ఎదురంటూ లేదె
నువ్వుంటె అలుపంటూ రాదె
నువ్వుంటె ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలె

posted under |

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారం గానో
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనం గానో
నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గానో
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

నేనిచ్చే లేఖలన్నీ చిన్చేస్తూ ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ చీ కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విస్గొస్తే ఫీల్ మై లవ్
నా ఉలుకే నక్చదన్టూ నా ఊహే రాదనీ
నేనాంటే గిట్టదు అన్టూ నా మాటే చెడని
నా జంటే చేరనంటు అన్టూ అన్టూ అనుకుంటూనే ఫీల్ మై లవ్

ఎరుపెక్కి చోస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతుఉనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైనా ఒక్క సారి హృదయం అంటు నీకొకటుంటే ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ...ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ...ఫీల్ మై లవ్

posted under |
Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు