పాడుతా తీయగా సల్లగా
పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా -
బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా

చరణం 1: కునుకుపడితె మనసు కాస్త కుదుటపడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది (2)
కలలే మనకు మిగిలిపోవు కలిమి సివరకూ (2)
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు? // పాడుతా తీయగా //

చరణం 2: గుండె మంటలారిపే సన్నీళ్ళు
కన్నీళ్లు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు (2)
పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళు (2)
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు // పాడుతా తీయగా //

చరణం 3: మణిసిపోతే మాత్రమేమి మనసు ఉంటదీ
మనసుతోటి మనసెపుడో కలసిపొతది (2)
సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ (2)
జనమజనమకది మరి గట్టిపడతది // పాడుతా తీయగా //

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు