ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిలచిపోయేనే ( ఏ దివిలో )
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాచి నిలిచేనే .....

పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంమ్స లా రావే ....( ఏ దివి)

నిదుర మబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదము పై మధువు పారుతూ కావ్య కన్యలా రావే.....( ఏ దివి)

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు