ఓ ప్రేమా నా ప్రేమా

ఓ ప్రేమా నా ప్రేమా
దైవాలాడే జుదం దయ్యంపాడే వేదం
ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జుదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం

ఓ ప్రేమ

క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
చిరమని సుఖమని కలయిక కలయని తలచుటే మధురమ
మ్రుతులకు జతులకు ముగియని కధలిది కధలిరా ప్రణయమ
అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమ
జారిపోయే కాలముచే జారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యయం
కరువౌతాను కన్నులో గురుతుంటాను గుండెలో

ఓ ప్రేమ

గిరిలను విడిచిన నదులిక వెనకకు తిరుగునా జగమున
కులమని కడుధని కులమని విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తోదిగితే ఘనతలే పెరుగున
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు ఆదురునా చెదురునా
పెదవాళ్ళ ప్రేమా కాటువేసే పామా
స్వాగతాలు అనగా చావుకైన ప్రేమ
మానై నేను బ్రతుకున్న మనిషై నేను చస్తున్న

ఓ ప్రేమ

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు