ఉరికే చిలకా వేచిఉంటాను కడవరకు

ఉరికే చిలకా వేచిఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటువేసావు నన్నేపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచిఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
నీ రాక కోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువా ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అదికాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే యద కుంగిపోయేనులే
మొదలో తుదిలో వదిలేసాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలను విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
కలకి ఇలకి ఊయలూగింది కంటపడి
కాటుక కళ్ళతో కాటువేసావు నన్నేపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచిఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
తొలిప్రాణమైనా ఒకనాటి ప్రేమా మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయనే
నే పురి విప్పి పరుగెత్తి గాలల్లే వచ్చా నీ వేణు గానానికి
అరెరే అరెరే నేడు కన్నీట తేనే కలిసే
ఉరికే చిలకా వేచిఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలను విడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు