రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రానేలా నీవుంటే కూనలమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా !
'నా ఉద్యోగం పోయిందండి.'
'తెలుసు .. అందుకే .. '
రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా
రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా !
పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ (2)
బహుశా అది తెలుసో ఏమో
బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిలా .. రాలేదు ఈ తోటకీ ఈ వేళా !
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా అందుకేనా .. అందుకేనా !
గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ (2)
బహుశా తను ఎందుకనేమో .. ల ల లా ల ల ల ల ల లా లా
బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా .. రాలేదు ఈ తోటకీ ఈ వేళా !
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రానేలా నీవుంటే కూనలమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రానేలా నీవుంటే కూనలమ్మా