యెవరు ఏమన్న
యెవరు ఏమన్న
యెవరు ఏమన్న మారదు ఈ ప్రేమ
యెవరు రాకున ఆగదు ఈ ప్రేమ
నెతుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ
నింగి నేల ఉన్ననాళ్ళు ఉంటుంది ఈ ప్రేమ
కాలమొస్తే సిరి మల్లె తీగకి చిగురెపుడుతుంది
ఈడు వస్తె ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డుపెట్టినంటనే వాన జల్లు ఆగిపోవునా
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవున
యేడు లోకలు ఏకం అయిన ప్రేమను ఆపేన
ప్రేమ అంటె ఆ దెవుడిచ్చిన చక్కని వరమంట
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడు అలుపే రాదంట
కండలెంత పెంచుకొచ్చిన కొండనెత్తి దించలేరురా
కక్షతోటి కాలు దువ్విన ప్రేమ నెవ్వరు ఆపలేరు రా
ప్రేమకెపుడైన జయమే గాని ఓటమి లేదంట