ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

ఈ పూటా .. చెలి నా మాటా .. ఇంక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే

ఇది స్వర్గమా .. నరకమా .. ఏమిటో తెలియదులే
ఈ జీవికీ .. జీవనమరణమూ .. నీ చెతిలో ఉన్నదిలే

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోల పాడీ కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలిగాలులకి తెరచాపై నిలిచేనే

నా ఆశలా .. ఊసులే .. చెవిలోన చెబుతానే
నీ అడుగులా .. చెరగని గురుతులే .. ప్రేమ చరితను అంటానే

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు