మధురమే మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటి కి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వై, నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే .. అ అ ఆ
నన్నే తడిపేస్తే మధురమే
||మధురమే||

నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువు పలికే అర మాటైనా మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువు పలికే అర మాటైనా మధురమ
యతి లేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగరఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమే మధురమే
||మధురమే||

సఖి విడిచే శ్వాసల్లో పరిమలమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమలమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన్నే ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంతా వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే , చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే తను రాల్చే కన్నిరయినా మధురమే మధురమే
||మధురమే||

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు