జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా

జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మా జారనీయకే కలా!
వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన
స్వరాల వూయలు ఊగువేల.. // జామురాతిరి జాబిలమ్మా //

చరణం 1:
కుహు కుహు సరాగాలే శ్రుతులుగా
కుశలమా హమే స్నేహం పిలవగా
కిల కిలా సమీపించే సడులతో
ప్రతిపొద పదాలే ఓ పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులు గుందని
వనము లేచి వద్దకొచ్చి నిదరపుచ్చని // జామురాతిరి జాబిలమ్మ //

చరణం 2:
మనసులో భయాలన్నీ మరచిపో మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో హుషాతీరం వెదకుతూ నిదురతో నిషరానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి // జామురాతిరి.. జాబిలమ్మా //


జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మ జారనియకే కలా వయ్యారి
వాలు కళ్ళలోన మమం హ్మం మ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్హ్హ హ స్వరాల వూయలు వూగు వేల

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు