మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా

మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక
నిన్ను కన్న తొలినాడే దేహం కదలక
ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే
ఎందరినో నే చూసాకాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగా ఎపుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు (2)


మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
మగువగా పుట్టినా జన్మఫలితమీనాడు తెలిసే
మత్తుగా మెత్తగా మనసు గెలిచి నా తోడు కలిసీ
యదలలోన ఊయలలుగే అందగాడు ఇతడంతా
యదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంటా
ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే
సుఖమై యద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇదియేం చరిత్రమో
మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణము గా
మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని
చుక్కపొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం సిగ్గులే మరువనా
నా పడకటింటికి నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా (2)

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు