ధీర ధీర ధీర మనసాగలేదురా
ఆ ఆ అ ఆ అ ఆ .......................
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రాదు నిద్దుర
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసందుకో దొరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .........................
సమరములో దూకగా చాకచక్యం నీదేరా.... సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా....అధిపతినై అది కాస్తా దొచేదా
పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా.... చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసందుకో దొరా
శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా.... కుసుమముతో ఖడ్గమే ఆడగా
మగసిరితో అందమే అంటు కడితే అంతేగా... అణువణువు స్వర్గమే ఐపొదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా .....చెరసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా
శత జన్మలైన ఆగిపొని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా........గుండెలొ నగారా ఇక మోగుతోందిరా
నవ సొయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియ పూజలేవొ చేసుకొనా చేతులార సేద తీర
ధీర ధీర ధీర
ధీర ధీర ధీర