హరే రామ హరే రామ రామ రామ హరే హరే
గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృఇష్ణ హరే కృఇష్ణ కృఇష్ణ కృఇష్ణ హరే హరే
రాముడ్నైనా కృఇష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్యమతి ప్రేమ స్మౄతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద
హరే రామ హరే కృఇష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృఇష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమా
ఓం సహనాభవతు సహనోగుణతు సహవీర్యం కరవా వహై
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహై
పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
మాటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శృఈరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా పద పద పద