నిండు గోదారి కద

నిండు గోదారి కద ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ
రెండు హౄదయాల కధే ఈ ప్రేమ పెళ్ళ్కిల పల్లకిలా ఈ ప్రేమ
కోవెలలో హారతి లా మంచిని పంచే ప్రేమ

ప్రేమ అన్నంది ఎంత గొప్పదో మరి
రాజు పేద భేదమంటు లేదు దీనికి
బ్రహ్మచారికి బ్రతుకు బాటసారికి ప్రేమ దీపమల్లె చూపుతుంది దారిని
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రందం ఈ ప్రేమ
ప్రేమే మదిలోనా మరి నమ్మకాన్ని పెంచుతుంది

ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని
ఆనకట్ట లాంటి హద్దులంటు లేవని
ప్రేమ తప్పని అంటె ఒప్పుకోమని గొంతు యెత్తి లొకమంత చాటి చెప్పని
ప్రేమే తొడుంటె నిత్యం మధుమాసం
తానె లేకుంటె బ్రతుకె వన వాసం
ప్రేమే కలకాలం మన వెంట ఉండి నడుపుతుంది

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు