ముందు తెలిసెనా ప్రభూ

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే!!2!!
సుందర మందార కుంద సుమదళములు పరువనా!!2!!
దారి పొడుగునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు!!2!!
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు!!2!!
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హౄదయము సంకెల చేసి

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు