.ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
ప్రేమేనా .............................
హో.......ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగా నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే
సాగిందే నీతో పాదమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
ఊగిందే నీకై హ్రుదయమే
ద్వేషమే స్నేహమై కష్టమే ఇష్టమై
దూరమే తీరమై భారమే తేలికై
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై
భేధాలె చివరికి కలిసిన భావాలై
ఏనాడొ చినుకల్లే మొదలయినది
ఈనాడే వరదైన వరమే ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే
మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
లాగిందే ఊహాలోకమే
చూపులే చిత్రమై మాటలే మంత్రమై
ఊపిరే ఊయలై నవ్వులే వెన్నలై
దేహాలే ప్రణయపు పువ్వుల దారాలై
ప్రాణాలే మమతల మల్లెల హారాలై
బ్రతుకంత బ్రతికించే భావం ఇది
ప్రతిరోజు జన్మించే మార్గం ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే
నువ్వంటే నా ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
నీకేలే నా సగ భాగమే
ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగా నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోన జరిగే ఇది
బాగుందే.............